ప్రభాస్ అరుదైన రికార్డ్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఆరు రోజుల్లోనే సలార్ మూవీ రూ.521.85 కోట్ల వసూళ్లు సాధించింది.
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆయన నటించిన మూడు సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ నటించిన బాహుబలి -1 రూ.650కోట్లు, బాహుబలి -2 రూ.1500 కోట్లు, సలార్ పార్ట్ -1 రూ. 500 కోట్లు (ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు) సాధించాయి. ప్రభాస్ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన రెండు సినిమాలు రూ.500 కోట్ల క్లబ్‌లో నిలిచాయి. రోబో 2.0 రూ.800 కోట్లు, జైలర్ రూ.650 కోట్ల వసూళ్లు సాధించాయి.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.176.52 కోట్లు, రెండో రోజు రూ. 101.39 కోట్లు, మూడోరోజు రూ.95.24 కోట్లు, నాలుగో రోజు రూ.76.91 కోట్లు, ఐదో రోజు రూ.40.17 కోట్లు, ఆరో రోజు రూ.31.62 కోట్ల వసూళ్లు సాధించింది. మొత్తంగా ఆరు రోజుల్లోనే సలార్ మూవీ రూ.521.85 కోట్ల వసూళ్లు సాధించింది.
#Salaar WW Box Office
— Manobala Vijayabalan (@ManobalaV) December 28, 2023
ENTERS 5️⃣0️⃣0️⃣ cr club in style.
#Prabhas becomes the only south Indian actor to hold 3 ₹500 cr club films. Next is superstar #Rajinikanth with two films #Jailer[₹650 cr] & #2Point0[₹800 cr]… pic.twitter.com/qp7ThUSADK
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గుర్తింపుతోనే ఆయన నటించిన ప్లాప్ సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు సాధించాయి. ప్రభాస్ కెరీర్‌లో ప్లాప్‌గా నిలిచిన సాహో రూ.450 కోట్లు, రాధే శ్యామ్, ఆదిపురుష్ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.