Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, September 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»International

    శ్రీలంకలో వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు… షాంపూతో తలంటుకున్న నిరసనకారులు!

    By Telugu GlobalJanuary 17, 20232 Mins Read
    శ్రీలంకలో వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు... షాంపూతో తలంటుకున్న నిరసనకారులు!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రజలు తమ ఉద్యమాల్లో క్రియేటివిటీ చూపిస్తూ ఉంటారు. పాలకులు కొత్త నిర్బంద విధానాలు అవలంభిస్తూ ఉంటే ఉద్యమకారులు తమ ఉద్యమాల్లో కొత్త కొత్త పద్దతులు అనుసరిస్తూ ఉంటారు.

    శ్రీలంకలో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. గత ఏడాది తాము తమ నిరసనలతో దేశం విడిచివెళ్ళేట్టు చేసిన అప్పటి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సేను మళ్ళీ దేశానికి తీసుక వచ్చిన విక్రమసింఘే అంటే ప్రజల్లో వ్యతిరేకత గూడు కట్టుకొని ఉంది. ఇప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళినా నిరసనలు ఎదురవుతున్నాయి.

    నిన్న విక్రమసింఘే జాఫ్నా యూనివర్సిటీ సందర్శ‌న‌కు రావాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనకు నిరసనగా తమిళులు వందలాది మంది రోడ్లెక్కి ఆందోళనకు దిగారు. నిరసనకారులను తరిమికొట్టేందుకు, శ్రీలంక పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. అయినప్పటికీ, పోలీసులను ధిక్కరించిన‌ నిరసనకారులు షాంపూని తీసి, తలపై స్ప్రే చేసుకొని వారి జుట్టును రుద్దుకున్నారు. తలంటుకోవడం కూడా ఒక నిరసన రూపంగా వారు ఎంచుకున్నారు.

    ఈ నిరసనకు సంబంధించిన చిత్రాలను డాక్టర్ తుసియన్ నందకుమార్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు. “ఈరోజు జాఫ్నాలో జరిగిన నిరసనల‌పై శ్రీలంక పోలీసులు వాటర్ ఫిరంగులు ప్రయోగించినప్పుడు.. తమిళులు షాంపూతో తలంటుకున్నారు” అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

    When Sri Lankan police fired water cannons on a protest in Jaffna today…

    The Tamils pulled out shampoo.

    You’ve got to love the defiance.#srilanka #tamil #eelam pic.twitter.com/g6Nfhb7OTu

    — Dr. Thusiyan Nandakumar (@Thusi_Kumar) January 15, 2023

    ఎమ్మెల్యే నందకుమార్ షేర్ చేసిన మరో వీడియోలో, నల్లూరులో పోలీసులపై నిరసనకారులు ఆవు పేడ కలిపిన నీళ్లను చల్లారు. తమిళ్ గార్డియన్ కథనం ప్రకారం, ర్యాలీ చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు శ్రీలంక పోలీసులు నల్లూరు అరసాటి రోడ్-వైమన్ రోడ్ కూడలి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు వాటర్‌ ఫిరంగులు ప్రయోగించారు.

    మీడియా నివేదికల‌ ప్రకారం, దివాలా తీసిన శ్రీలంక ఇటీవల ప్రభుత్వ ఖర్చులో కోతలను ప్రకటించింది. భారీగా పన్నులను పెంచి ప్రజలపై భరించలేనంత భారాన్ని మోపింది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను చెల్లించడానికి కూడా ప్రభుత్వం దగ్గర తగినంత ఆదాయం లేదని నివేదికలు తెలిపాయి.

    “ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం తాము ఊహించిన దానికంటే దారుణంగా ఉండబోతోందని రాష్ట్రపతి నిన్న మంత్రివర్గానికి తెలియజేశారు” అని ప్రభుత్వ అధికార ప్రతినిధి బందుల గుణవర్దన విలేకరులతో అన్నారు.

    Protesters were seen throwing water mixed with cow dung at the security forces as they continued to clash in Nallur. pic.twitter.com/IUm8OQDomJ

    — Tamil Guardian (@TamilGuardian) January 15, 2023

    Police water cannons
    Previous ArticleKuttey Movie Review: ‘కుత్తే’- హిందీ మూవీ రివ్యూ {2.5/5}
    Next Article విశ్వనాథ వారు అనువదించిన… వివేకానందుని యతిగీతము
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.