Telugu Global
NEWS

Indus Appstore | గూగుల్‌.. ఆపిల్‌ల‌కు బ‌స్తీమే స‌వాల్.. ఫోన్‌పే దేశీయ‌ యాప్ స్టోర్‌..!

అమెరికా కేంద్రంగా ప‌ని చేస్తున్న ఈ-కామ‌ర్స్ సంస్థ వాల్‌మార్ట్ .. త‌న అనుబంధ సంస్థ ఫోన్‌పే (Phonepe) ఆధ్వ‌ర్యంలో డెవ‌ల‌ప‌ర్ల కోసం `మేడ్ ఇన్ ఇండియా` యాప్ స్టోర్ `ఇండ‌స్‌` తెరుస్తున్న‌ది.

Indus Appstore | గూగుల్‌.. ఆపిల్‌ల‌కు బ‌స్తీమే స‌వాల్.. ఫోన్‌పే దేశీయ‌ యాప్ స్టోర్‌..!
X

Indus Appstore | ఇప్పుడు సొసైటీ అంతా యాప్స్‌.. ఆండ్రాయిడ్ మ‌యం.. స్మార్ట్ ఫోన్లు మొద‌లు టాబ్లెట్లు.. ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు.. లాప్‌టాప్‌ల వ‌ర‌కూ స‌ర్వం యాప్‌ల‌మ‌యం.. సెర్చింజ‌న్ `గూగుల్`.. టెక్ దిగ్గ‌జం `ఆపిల్‌` వాటిని త‌మ యూజ‌ర్ల‌కు అందిస్తూ వ‌చ్చాయి. ఇటు గూగుల్‌.. అటు ఆపిల్‌కు భార‌త్‌లో గ‌ట్టి స‌వాల్ ఎదురు కాబోతున్న‌ది. అమెరికా కేంద్రంగా ప‌ని చేస్తున్న ఈ-కామ‌ర్స్ సంస్థ వాల్‌మార్ట్ .. త‌న అనుబంధ సంస్థ ఫోన్‌పే (Phonepe) ఆధ్వ‌ర్యంలో డెవ‌ల‌ప‌ర్ల కోసం `మేడ్ ఇన్ ఇండియా` యాప్ స్టోర్ `ఇండ‌స్‌` తెరుస్తున్న‌ది. ఇండియ‌న్ యూజ‌ర్ల‌కు స‌ర్వీసులు స్థానికంగానే అందుబాటులోకి తెచ్చేందుకు త్వ‌ర‌లో ఫోన్ పే త‌న ఇండ‌స్ యాప్ స్టోర్ తీసుకువ‌స్తున్న‌ది.

త‌మ యాప్ స్టోర్‌లో యాప్స్ రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని, ఈ ప్లాట్‌ఫామ్‌పై స‌ద‌రు యాప్స్ అప్‌లోడ్ చేయాల‌ని భార‌త్ యాప్ డెవ‌ల‌ప‌ర్ల‌ను ఆహ్వానిస్తోంది ఫోన్‌పే. ఏడాది పాటు ఈ యాప్స్ ఉచితంగానే లిస్టింగ్ చేస్తుంది ఫోన్ పే `ఇండ‌స్‌` యాప్ స్టోర్‌. అటుపై గూగుల్‌, ఆపిల్‌తో పోలిస్తే చాలా నామ‌మాత్ర‌ఫు ఫీజు వ‌సూలు చేస్తుంది. ప్ర‌స్తుతం డెవ‌ల‌ప‌ర్లు త‌యారు చేసిన యాప్స్‌ను త‌మ యాప్ స్టోర్‌లో లిస్ట్ చేసినందుకు వాటిపై సంబంధిత డెవ‌ల‌ప‌ర్ల నుంచి గూగుల్‌, ఆపిల్ 15-25 శాతం చార్జీ వ‌సూలు చేస్తున్నాయి.

`యాప్స్ డెవ‌ల‌ప‌ర్ల నుంచి యాప్ పేమెంట్స్‌పై ఎటువంటి ప్లాట్ ఫామ్ ఫీజు లేదా క‌మీష‌న్ వ‌సూలు చేయ‌బోదు ఇండ‌స్ యాప్ స్టోర్‌. డెవ‌ల‌ప‌ర్లు త‌మ సొంత యాప్స్ ద్వారా పేమెంట్ గేట్‌వే ఏర్పాటు చేసుకునేందుకు స్వేచ్ఛ ఉంటుంది` అని ఫోన్ పే శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. విజిబిలిటీ, సెర్చ్ ఆప్టిమైజేష‌న్‌తోపాటు త‌మ‌కు న‌చ్చిన భాష‌ల్లో యాప్ డెవ‌ల‌ప‌ర్లు లిస్ట్ చేసేందుకు 12 భాష‌ల్లో `ఇండ‌స్ యాప్ స్టోర్‌` అందుబాటులో ఉంటుంది.

`2026 నాటికి భార‌త్‌లో 100 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు ఉంటారు. క‌నుక నూత‌న త‌రం.. లోక‌లైజ్డ్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ నిర్మించ‌డానికి అద్భుత‌మైన అవ‌కాశం ఉంది. భారీ వినియోగ‌దారుల మార్కెట్‌, యాప్ డెవ‌ల‌ప‌ర్లు ఉన్నా.. ఎల్ల‌వేళ‌లా త‌మ యాప్‌ల పంపిణీకి ఒకే ఒక యాప్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్‌తోనే ఆధార‌ప‌డి ప‌ని చేయాల్సి వ‌స్తున్న‌ది. భార‌త్‌లోని యాప్ డెవ‌ల‌ప‌ర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌కు విశ్వ‌స‌నీయ‌మైన ప్ర‌త్యామ్నాయం అందించ‌గ‌ల‌మ‌న్న ఆశాభావంతో ఉన్నాం. ఇది పూర్తిగా లోక‌లైజ్డ్‌, ఆఫ‌ర్స్ బెట‌ర్ యాప్ డిస్క‌వ‌రీ, వినియోగ‌దారుల లావాదేవీలు జ‌రుపుకునేందుకు వెసులుబాటుగా ఉంటుంది` అని ఇండ‌స్ యాప్ స్టోర్ స‌హా వ్య‌వ‌స్థాప‌కుడు, సీపీఓ ఆకాశ్ డోంగ్రే చెప్పారు.

ఆకాశ్ డోంగ్రేతోపాటు రాకేశ్ దేశ్‌ముఖ్‌, సుధీర్ బీ అనే ముగ్గురు ఐఐటీయ‌న్స్‌ 2015లో భార‌త్‌లో స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లకు చేయూత‌నిచ్చేందుకు, వారి చాయిస్‌కు అవ‌స‌ర‌మైన కంటెంట్ అందించేందుకు ఇండ‌స్ ఓఎస్ అనే లీడింగ్ యాప్ కంటెంట్‌-డిస్క‌వ‌రీ ప్లాట్‌ఫామ్ స్థాపించారు. ద‌క్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ శాంసంగ్ మ‌ద్ద‌తుతో ప‌ని చేస్తున్న వెంచ‌ర్ క్యాపిట‌ల్ సంస్థ `ఇండ‌స్ యాప్ బ‌జార్` పేరుతో పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ అవ‌త‌రించ‌నున్న‌ది.


First Published:  23 Sept 2023 9:03 AM GMT
Next Story