నేవీలో అద్భుతమైన అవకాశాలు.. పూర్తి వివరాలివే..
నేవీలో సబ్ లెఫ్టినెంట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేదు.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి సెలక్ట్ చేస్తారు.
ఇండియన్ నేవీ.. ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవాళ్లు వీటికి అప్లై చేసుకోవచ్చు. వీటికి రాత పరీక్ష లేదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి సెలక్ట్ చేస్తారు. అందులో సెలక్ట్ అయినవారిని సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందులో మొత్తం 217 ఖాళీలున్నాయి. విభాగాలు, అర్హతల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేవీలో సబ్ లెఫ్టినెంట్ ఆఫీసర్ పోస్టులకు అవివాహితులు మాత్రమే అర్హులు. అకడమిక్ మార్కులను బట్టి అభ్యర్థులను ఫిల్టర్ చేస్తారు. కోర్సు ఆఖరి సంవత్సరం చదువుతున్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని పోస్టులకూ 60 శాతం మార్కులు తప్పనిసరి. మార్కుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయితే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ట్రైనింగ్ మొదలవుతుంది. మంచి వేతనంతో పాటు అన్నిరకాల సదుపాయాలు ఉంటాయి.
ఈ పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్.. అనే మూడు విభాగాలున్నాయి. పోస్టును బట్టి రూ.56,000 నుంచి లక్ష దాకా శాలరీలుంటాయి. అయితే ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయనవాళ్లు పదేళ్ల పాటు మాత్రమే విధుల్లో కొనసాగే వీలుంటుంది. ఆ తర్వాత రెండేళ్లు చొప్పున రెండు సార్లు సర్వీసు పొడిగిస్తారు.అలా మొత్తంగా 14 ఏళ్లపాటు ఉద్యోగంలో కొనసాగొచ్చు.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో..
జనరల్ సర్వీస్, హైడ్రో క్యాడర్ విభాగంలో 56 ఖాళీలు ఉన్నాయి. అందులో 16 మహిళలకు రిజర్వ్.
అర్హత: బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగంలో 5, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ విభాగంలో 15, పైలట్ విభాగంలో 25 ఖాళీలున్నాయి.
అర్హత: బీఈ/బీటెక్‌లో 60, పది, ఇంటర్‌లోనూ 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
లాజిస్టిక్స్ విభాగంలో 20 ఖాళీలలున్నాయి.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎమ్మెస్సీ(ఐటీ)/ఎంసీఏ లేదా బీఎస్సీ/బీకాంతోపాటు లాజిస్టిక్స్/సప్లై చెయిన్‌లో పీజీ డిప్లొమా లాంటి కోర్సులు చేసి ఉండాలి.
ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో..
12 ఖాళీలున్నాయి.
అర్హత: బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివినవాళ్లు అర్హులు.
టెక్నికల్ బ్రాంచ్‌లో..
ఇంజినీరింగ్ కు 25, ఎలక్ట్రికల్ కు 45, నేవల్ కన్‌స్ట్రక్టర్ విభాగంలో 14 ఖాళీలున్నాయి.
అర్హత: ఆయా బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పాసై ఉండాలి.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లకు జులై 2, 1998 - జనవరి 1, 2002 మధ్య పుట్టినవాళ్లు అర్హులు. మిగిలిన అన్ని పోస్టులకు జులై 2, 1998 - జనవరి 1, 2004 మధ్య పుట్టినవాళ్లై ఉండాలి.
నవంబరు 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.