దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్రం గవర్నర్ల బదిలీలు, నియామకాలు చేపట్టింది. మూడు రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేసి.. రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు. అలాగే బీహార్ గవర్నర్‌గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా, ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను బీహార్‌కు బదిలీ చేశారు. వచ్చే ఏడాది పోలింగ్ జరగనున్న బీహార్‌లో పని చేసేందుకు ఆయన ఇప్పుడు నియమితులయ్యారు.. మిజోరాం గవర్నర్‌గా జనరల్ వీకే సిన్హా, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Previous Articleఎవరైనా కూరగాయాలు కోసే కత్తితో బైపాస్ సర్జరీ చేయాలనుకుంటారా?
Keep Reading
Add A Comment