Telugu Global
National

అయోధ్యలో 11 నుంచి వీఐపీ దర్శనాలు రద్దు

ఆలయ మొదటి వార్షికోత్సవం నేపథ్యంలో నిర్ణయం

అయోధ్యలో 11 నుంచి వీఐపీ దర్శనాలు రద్దు
X

అయోధ్య రామ మందిరంలో ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు వీవీఐపీ, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నామని ఆలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్ట ద్వాదశి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ మూడు రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీఐపీ దర్శనాలు ఉండవని, పాసులు కూడా జారీ చేయబోమని పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి స్లాట్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2024 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 13.55 కోట్ల భారతీయులు, 3,153 మంది విదేశీయులు రామ మందిరంలో బాలరాముడి దర్శనం చేసుకున్నారని తెలిపారు.

First Published:  3 Jan 2025 3:30 PM IST
Next Story