Telugu Global
National

కాస్‌ తీర్పుపై తొలిసారి స్పందించిన వినేశ్‌ ఫోగట్‌

బాధతోనే రెజ్లింగ్‌ కెరీర్‌కి కూడా గుడ్‌బై చెప్పిన వినేశ్‌ కాస్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో మరింత ఆవేదనకు గురైన ఆమె సోషల్‌ మీడియాలో తన బాధనను పంచుకుంది.

కాస్‌ తీర్పుపై తొలిసారి స్పందించిన వినేశ్‌ ఫోగట్‌
X

ఒలింపిక్స్‌లో తనపై వేసిన అనర్హత వేటును సవాల్‌ చేస్తూ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ (కాస్‌) బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. దీనిపై వినేశ్‌ ఫోగట్‌ తొలిసారి స్పందించింది. సోషల్‌ మీడియాలో హార్ట్‌ బ్రేకింగ్‌ సింబల్‌తో పోస్టు పెట్టింది. కాస్‌ తీర్పు తనను ఎంతో వేదనకు గురిచేసిందనే అర్థం వచ్చేలా పారిస్‌ ఒలింపిక్స్‌లో మ్యాట్‌పై కిందపడి కన్నీళ్లు తుడుచుకుంటున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కి కాస్‌లో అనుకూలంగా తీర్పు వస్తుందని దేశమంతా ఆశతో ఎదురుచూసినా చివరికి నిరాశే మిగిలింది. యునైటెడ్‌ ప్రపంచ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తనపై వేసిన అనర్హతను సవాలు చేస్తూ వినేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కాస్‌ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అడాక్‌ డివిజన్‌ సోల్‌ ఆర్బిట్రేటర్‌ అనబెల్‌ బెనెట్‌ తీర్పునిచ్చారు.

పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్‌.. భారత్‌కు కనీసం రజతం ఖాయం చేసింది. కానీ, రెండో రోజు బరువు చూసే సమయానికి 100 గ్రాములు అదనంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడిన‌ సంగతి తెలిసిందే. ఈ బాధతోనే రెజ్లింగ్‌ కెరీర్‌కి కూడా గుడ్‌బై చెప్పిన వినేశ్‌ కాస్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో మరింత ఆవేదనకు గురైన ఆమె సోషల్‌ మీడియాలో తన బాధనను పంచుకుంది. వినేశ్‌ పోస్టును చూసిన నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ‘వినేశ్‌ లాంటి డైమండ్‌ ఉండగా.. మాకు గోల్డ్‌ మెడల్‌ ఎందుకు?’ అని.. ’మా ఛాంపియన్‌’, ’అసలైన ఛాంపియన్‌ నువ్వే’, ’నువ్వు మహిళల రెజ్లింగ్‌ లెజెండ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ మద్దతుగా నిలుస్తున్నారు.

First Published:  16 Aug 2024 3:38 AM GMT
Next Story