రాహుల్‌గాంధీకి సమన్లు జారీ చేసిన యూపీ కోర్టు
వచ్చే ఏడాది జనవరి 7న హాజరుకావాలని పేర్కొన్న బరేలీ జిల్లా కోర్టు
BY Raju Asari22 Dec 2024 12:51 PM IST
X
Raju Asari Updated On: 22 Dec 2024 12:51 PM IST
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలపై బరేలీ జిల్లా కోర్టు ఈ సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కులగణనపై చేసిన వ్యాఖ్యలు దేశంలో అంతర్యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయి. అందుకే ఆ వ్యాఖ్యలపై మొదట ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో కేసు దాఖలు చేశాం. అక్కడ కేసు కేసును కొట్టివేశారు. దీంతో బరేలీ జిల్లా కోర్టును ఆశ్రయించాం. ఈ క్రమంలోనే కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 7న హాజరుకావాలని కోర్టు అందులో పేర్కొన్నదని పిటిషనర్ తెలిపారు.
Next Story