Telugu Global
National

యూజీసీ-నెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

మొత్తం 85 సబ్జెక్టులకు జనవరి 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష

యూజీసీ-నెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల
X

యూజీసీ-నెట్‌ డిసెంబర్‌ 2024 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. మొత్తం 85 సబ్జెక్టులకు జనవరి 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో (సీబీటీ) జరిగే ఈ పరీక్ష అడ్మిట్‌ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అడ్మిట్‌ కార్డులపై మీ ఫొటో, బార్‌కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌ను చెక్‌ చేసుకోండి. వీటిలో ఏది లేకపోయినా మరోసారి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని యూజీసీ సూచించింది. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడటానికి ఉపయోగపడే ఈ పరీక్ష కోసం డిసెంబర్‌ 11 వరకు అప్లికేషన్లు స్వీకరించిన విషయం విదితమే. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011-40759000 నంబర్‌ లేదా ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

అడ్మిట్‌కార్డుల కోసం కింది లింక్‌ను క్లిక్‌ చేయండి

https://ugcnetdec2024.ntaonline.in/admitcard/index


First Published:  29 Dec 2024 3:37 PM IST
Next Story