Telugu Global
National

ఆధార్‌ అప్‌ డేట్‌ కు ఇంకో రెండువారాలే గడువు!

డిసెంబర్‌ 20 నుంచి క్రెడిట్‌ కార్డుల కొత్త చార్జీలు అమల్లోకి

ఆధార్‌ అప్‌ డేట్‌ కు ఇంకో రెండువారాలే గడువు!
X

డిసెంబర్‌ నెల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి.. అవి ఏంటి అంటారా? ఆధార్‌ అప్‌డేషన్‌ కు డిసెంబర్‌ 14వ తేదీ ఆఖరు. క్రెడిట్‌ కార్డుల కొత్త చార్జీలు కూడా డిసెంబర్‌ నెలలోనే మొదలు కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది జిల్లాలు కాస్త 33 జిల్లాలయ్యాయి. ఒక్క హైదరాబాద్‌ మినహా మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సమూల మార్పులు జరిగాయి. తెలంగాణ ఆవిర్భావానికి ముందు, రాష్ట్రం వచ్చిన కొత్తలో ఆధార్‌ కార్డులు తీసుకున్న వారి అడ్రస్‌ లో పాత జిల్లాలు, మండలాలే ఉంటాయి. ఇప్పుడు ఆ వివరాలు అప్‌ డేట్‌ చేసుకోవాలి. ఈ చేర్పులు, మార్పులను డిసెంబర్‌ 14వ తేదీలోపు ఏ ఆధార్‌ సెంటర్‌ లోనైనా ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మార్పులు చేసుకోవాలంటే రూ.50 ఫీజు చెల్లించాలి.

వేతన జీవులే కాదు, మధ్య తరగతి వాళ్లందరి దగ్గర ఒకటో, రెండో క్రెడిట్‌ కార్డులుండటం ఇప్పుడు కామన్‌ అయిపోయింది. క్రెడిట్‌ కార్డుల చార్జీలు డిసెంబర్‌ నెలలోనే పెరగనున్నాయి. డిసెంబర్‌ 20వ తేదీ నుంచి క్రెడిట్‌ కార్డుల ఫైనాన్స్‌ చార్జీల పెంపు అమల్లోకి రానుంది. ఫైనాన్స్‌ చార్జీలే కాదు, రెంటల్‌ పేమెంట్‌ పై ఒక శాతం ఫీజు వసూలు చేయనున్నారు. రూ.10 వేల పైన చేసే వాలెట్‌ లోడింగ్‌లపైనా ఒక శాతం ఫీజు వసూలు చేస్తారు. దీంతో క్రెడిట్‌ కార్డు వినియోగదారుల మంథ్లీ బిల్లులు భారీగా పెరగనున్నాయి.

First Published:  28 Nov 2024 5:31 PM IST
Next Story