రీల్స్ చేస్తూ లోయలోపడి ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తన రీల్స్, వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న 26 ఏళ్ల ఇన్‌స్ట్రాగామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దార్ అనే యువతి ఓ లోయలో జారిపడి మృతి చెందింది.
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తన రీల్స్, వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న 26 ఏళ్ల ఇన్‌స్ట్రాగామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దార్ అనే యువతి ఓ లోయలో జారిపడి మృతి చెందింది. వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ట్రావెల్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఆమె చివరకు అవే రీల్స్ చేస్తూ ప్రాణాలు వదిలింది. కుంభే జలపాతం వద్ద రీల్ చేస్తుండగా జారిపడి మరణించింది.
వివరాల్లోకి వెళితే..
ముంబయికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మిత్రులతో కలిసి మంగళవారం మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ సమీపంలో ఉన్న కుంభే జలపాతానికి వెళ్ళింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రకృతి అందాల మధ్య ఉన్న ఆ జలపాతాల సోయగాన్ని రీల్‌లో బంధించడానికి ప్రయత్నించారు ఆమె టీం. ఒక లోయ దగ్గర రీల్స్ చేస్తోంది. లోయకు అంచున నిలబడి వీడియో చిత్రీకరిస్తుండగా సడన్‌గా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తీశారు. కోస్ట్ గార్డ్, కోలాడ్ రెస్క్యూ టీమ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది శ్రమించి ఆమెను బయటకు తీశారు. కానీ, తీవ్ర గాయాలు కావటంతో ఆమెను మనగావ్ సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందని పోలీసులు వెల్లడించారు.
ఆన్వీకి ఇన్‌స్టాలో 2.56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేసిన పోస్ట్‌లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి. వృత్తిరీత్యా ఛార్టెర్డ్ అకౌంటెంట్ అయిన ఆమె మాన్‌సూన్ టూరిజంపై తీసిన వీడియోలే తనను లక్షలమందికి దగ్గర చేశాయి. ఆనందంగా పూర్తి కావలసిన విహారయాత్ర ఇలా విషాదంగా మారడంతో ఆమె స్నేహితులు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.