Telugu Global
National

మతం కాదు వాళ్ల పార్టీనే ప్రమాదంలో ఉంది

బాలివుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ సంచలన వ్యాఖ్యలు

మతం కాదు వాళ్ల పార్టీనే ప్రమాదంలో ఉంది
X

మతం కాదు వాళ్ల పార్టీనే ప్రమాదంలో ఉందని బాలివుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ ముఖ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావు దేశ్‌ ముఖ్‌ తనయుడైన రితేశ్‌ ప్రముఖ నటి జెనీలియాను వివాహం చేసుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే రితేశ్‌ ఈ ఎన్నికల్లో లాతూర్‌ నుంచి తన సోదరుడు ధీరజ్‌ దేశ్‌ముఖ్‌ పోటీలో ఉండటంతో ఆయన కోసం కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ ప్రమాదంలో ఉంది కాబట్టే దానిని రక్షించాలని కోరుతూ వాళ్లు ప్రజలను కోరుతున్నారని, అలాంటి వాళ్లు అభివృద్ధి గురించి మాట్లాడితే మంచిదన్నారు. చిత్తశుద్ధితో పని చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలని.. అలా పని చేయని వాళ్లు మాత్రమే దేవుడి గురించి, మతం గురించి మాట్లాడుతారన్నారు. మహారాష్ట్రలోని ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయిందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. 2019 ఎన్నికల్లో తన సోదరుడు 1.21 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని, ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  11 Nov 2024 5:31 PM IST
Next Story