Telugu Global
National

జమ్ముకశ్మీర్‌లో ప్రారంభమైన రెండో విడత పోలింగ్‌

ఈ విడతలోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, బీజేపీ చీఫ్‌ రవీందర్‌ రైనా, పీసీసీ అధ్యక్షుడు తారిఖ్‌ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్‌లో ప్రారంభమైన రెండో విడత పోలింగ్‌
X

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. శ్రీనగర్‌, బడ్‌గామ్‌, రాజౌరీ, పూంఛ్‌, గండేర్‌బల్‌, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అక్టోబర్‌ 1న మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్‌ జరగనున్నది. అక్టోబర్‌ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

రెండో విడతలోనే జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, బీజేపీ జమ్మకశ్మీర్‌ చీఫ్‌ రవీందర్ రైనా, పీసీసీ అధ్యక్షుడు తారిఖ్‌ హమీద్‌ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒమర్‌ అబ్దుల్లా గండేర్‌, బడ్ గామ్‌ స్థానాల్లో పోటీలో నిలుచున్నారు. హమీద్‌ కర్రా సెంట్రల్‌ షాల్టెంగ్‌, రవీందర్‌ రైనా నౌషేరా స్థానాల్లో బరిలో ఉన్నారు.

First Published:  25 Sept 2024 9:04 AM IST
Next Story