Telugu Global
National

జమ్మూలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి తీర్మానం అదే!

రాష్ట్ర హోదా ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తీర్మానం చేసి ప్రధానికి సమర్పిస్తామని ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు.

జమ్మూలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి తీర్మానం అదే!
X

జమ్మూకశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చకూడదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదని.. కానీ 2019 వరకు జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని, హోం మంత్రి, బీజేపీ సీనియర్‌ మంత్రులు చెప్పారని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల రాష్ట్ర హోదా వరుసగా ఉంటాయన్నారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర హోదా ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తీర్మానం చేసి ప్రధానికి సమర్పిస్తామని అబ్దుల్లా పేర్కొన్నారు.కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడం, అభివృద్ధికి బాటలు వేయడం కోసం రాష్ట్ర హోదా తప్పనిసరి అని పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఉన్న రాజకీయపార్టీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుని బలహీనపరచడానికి యత్నించిందని మండిపడ్డారు. కానీ ఆపార్టీ ఎత్తులు ఫలించలేదన్నారు.

గత ఎన్నికలప్పుడు కౌంటింగ్‌ సమయంలో రన్నింగ్‌ చేసిన ఓటమిని చవిచూసిన ఒమర్‌ అబ్దుల్లా ఈసారి కౌంటింగ్‌రోజున రన్నింగ్‌ చేయాలా? వద్దా అన్న సంశంయంలో ఉండిపోయానని తెలిపారు. కానీ ఆ అనుమానాన్ని దాటుకొని, పరుగెత్తి, ఆ మూఢనమ్మకాన్ని బద్దలుకొట్టానంటూ వ్యాఖ్యానించారు.

నిన్న వెల్లడైన జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఫలితాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారాన్ని దక్కించుకున్నది. కూటమిలోని ఎన్సీ 42, కాంగ్రెస్‌ 6, సీపీఎం 1 సీటు గెలుచుకున్నాయి. 2014లో 20.77 శాతం ఓట్లను సాధించిన ఎన్సీ ఈసారి 23.43 శాతం ఓట్లను సాధించింది.బీజేపీకి 29, మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీకి మూడు సీట్లు మాత్రమే దక్కాయి. జమ్ముకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు చోట్లా పోటీ చేసిన గెలిచిన ఆయనే సీఎం అని ఆ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే.

First Published:  9 Oct 2024 4:42 AM GMT
Next Story