Telugu Global
National

‘శీష్‌ మహల్‌’పై విచారణకు కేంద్రం ఆదేశం!

సీపీడబ్ల్యూడీ వాస్తవ నివేదికను సమర్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి 13న ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం

‘శీష్‌ మహల్‌’పై విచారణకు కేంద్రం ఆదేశం!
X

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన శీష్‌ మహల్‌ (సీఎం అధికారిక నివాసం) పునరుద్ధరణలో భారీ అవకతకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వాస్తవ నివేదికను సమర్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి 13న ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో 6 ప్లాగ్‌స్టాప్‌ బంగ్లాను పునరుద్ధరణకు ఆప్‌ ప్రభుత్వం భవన నిబంధనలు ఉల్లంఘించిదనే ఆరోపణపలై విచారించి సమగ్ర నివేదిక తయారుచేయాలని కేంద్రం సీపీడబ్ల్యూడీని ఆదేశించింది.

అధికారిక నివాసానికి పొరుగునున్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి విలాసవంతమైన శీశ్‌మహల్‌విస్తరించారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సోమవారం ఆరోపించారు. ఆ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు లేఖ రాశారు. దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక నూతన సీఎం శీశ్‌మహల్‌లో ఉండబోరని పేర్కొన్నారు.ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌ స్టాప్‌ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారు. ఈ బంగ్లాను శీశ్‌ మహల్‌ (అద్దాల మేడ)గా అభివర్ణిస్తున్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7-స్టార్‌ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆప్‌ మోసాలకు ఆ మహల్‌ ఓ ఉదాహరణ అంటూ బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని ప్రధాని మోడీ ధ్వజమెత్తిన విజయం విదితమే.

First Published:  15 Feb 2025 12:59 PM IST
Next Story