Telugu Global
National

పంజాబ్‌-హర్యానా సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్తత

శంభు వద్ద భారీగా మోహరించిన పోలీసులు, పారా మిలటరీ బలగాలు

పంజాబ్‌-హర్యానా సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్తత
X

పంజాబ్‌-హర్యానా సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని పంజాబ్‌ రైతులు మళ్లీ ప్రారంభించారు. ఒక రోజు తర్వాత మళ్లీ పునరుద్ధరించారు. రైతులు చేపట్టిన కార్యక్రమాన్ని బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అనుమతి లేఖ ఉంటేనే పాదయాత్రకు వెళ్లనిస్తామని పోలీసులు అంటున్నారు. అయితే అనుమతి లేకున్నా జెండాలు పట్టుకుని రైతులు ముందుకు కదిలారు. ఈ క్రమంలోనే రైతులపై పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో మొన్న 101 మంది రైతులతో 'చలో ఢిల్లీ' పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. చర్చలు చేపట్టాలన్న రైతుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. శంభు వద్ద భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు.

First Published:  8 Dec 2024 3:30 PM IST
Next Story