Telugu Global
National

విమానంలో సాంకేతిక లోపం..ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ముంబయి నుంచి దుబాయ్‌ బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానంతో ఆందోళనలో ప్రయాణికులు

విమానంలో సాంకేతిక లోపం..ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
X

ముంబయి నుంచి దుబాయ్‌ బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ముంబయి నుంచి మంగళవారం రాత్రి 8 గంటలకు వెళ్లాల్సిన విమానం.. ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరింది. 50 నిమిషాల ప్రయాణం తర్వాత తిరిగి ముంబయిలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఏం జరుగుతున్నదో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ విమానం దుబాయ్‌ వెళ్లాల్సిన ఏపీ, తెలంగాణ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

First Published:  19 Feb 2025 7:49 AM IST
Next Story