ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉచితంగా రేషన్, డబ్బు ఇస్తుంటే.. పనిచేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం
BY Raju Asari12 Feb 2025 1:58 PM IST
![ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు](https://www.teluguglobal.com/h-upload/2025/02/12/1402755-supreme-court.webp)
X
Raju Asari Updated On: 12 Feb 2025 1:58 PM IST
పార్టీల ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని అభిప్రాయపడింది. ఉచితంగా రేషన్, డబ్బు ఇస్తుంటే.. పనిచేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొన్నది. ఉచితాల కారణంగా ప్రజలు మొగ్గు చూపడం లేదని తెలిపింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఉచితాలపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Next Story