Telugu Global
National

అభ్యంతరకర ఆన్‌లైన్‌ కంటెంట్‌ నియంత్రణకు కఠిన నిబంధనలు

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ నిశికాంత్‌ దూబే రాసిన లేఖకు బదులిచ్చిన కేంద్రం

అభ్యంతరకర ఆన్‌లైన్‌ కంటెంట్‌ నియంత్రణకు కఠిన నిబంధనలు
X

'ఇండియాస్‌ గాట్‌ లాంటెంట్‌' కార్యక్రమంలో యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం విదితమే. ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకున్నది. ఈ క్రమంలో ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌ను ఓటీటీలు, సోషల్‌ మీడియాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలాగే ఆన్‌లైన్‌ కంటెంట్‌ నియంత్రణకు కఠిన నిబంధనలు అవసరమని భావిస్తున్నది. ఆ దిశగా ప్రస్తుతం ఉన్న చట్టాల్లో సవరించాల్సిన అంశాలు ఏమున్నాయో పరిశీలిస్తున్నది. అభ్యంతరకర ఆన్‌లైన్‌ సమాచార నియంత్రణకు డిమాండ్లు పెరుగుతున్నాయని పేర్కొన్నది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ నిశికాంత్‌ దూబే రాసిన లేఖకు బదులిచ్చింది.

First Published:  22 Feb 2025 6:22 PM IST
Next Story