Telugu Global
National

అర్వింద్‌ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌ పై రాళ్లదాడి

ఓటమి భయంతోనే బీజేపీ దాడి చేసిందన్న ఆప్‌

అర్వింద్‌ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌ పై రాళ్లదాడి
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేషనల్‌ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కాన్వాయ్‌లోని కార్ల అద్దాలు పగిలాయి. దాడిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ 'ఎక్స్‌' వేదికగా స్పందించింది. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి దాడులకు పాల్పడుతోందని మండిపడింది. కేజ్రీవాల్‌ ప్రచారాన్ని అడ్డుకునేందుకు బీజేపీ చేస్తున్న ఇలాంటి దాడులకు తాము భయపడబోమని తేల్చిచెప్పింది. రాళ్ల దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఆప్‌ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ కాన్వాయ్‌ ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించాలన్న విషయం కూడా ఆ పార్టీ మర్చిపోయిందని మండిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్తున్నానని బీజేపీ నేత పర్వేశ్‌ వర్మ 'ఎక్స్‌' వేదికగానే కౌంటర్‌ ఇచ్చారు.

First Published:  18 Jan 2025 7:45 PM IST
Next Story