Telugu Global
National

ఢిల్లీ కొత్త ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు

ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై గెలుపొందిన పర్వేశ్‌ వర్మతో సహా మరో ఐదుగురు మంత్రులు నేడు ప్రమాణం చేయనున్నారని తెలిపిన అధికారులు

ఢిల్లీ కొత్త ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు
X

రేఖాగుప్త నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు ఉండనున్నారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై గెలుపొందిన పర్వేశ్‌ వర్మతో సహా మరో ఐదుగురు మంత్రులు నేడు ప్రమాణం చేయనున్నారని అధికారులు తెలిపారు. రేఖాగుప్త సలహా మేరకు రాష్ట్రపతి పర్వేష్ వర్మ (న్యూఢిల్లీ), మంజీందర్ సింగ్ సిర్సా (రాజౌరీ గార్డెన్), రవీంద్ర కుమార్ ఇంద్రజ్ (బవానా), కపిల్ మిశ్రా (కరవాల్ నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), మరియు పంకజ్ కుమార్ సింగ్ (వికాస్ పురి)లను మంత్రులుగా నియమించాలని కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్‌ గుప్తా ఉండనున్నారని జాతీయ మీడియా పేర్కొన్నది.

2015లో ఆప్‌ ఎమ్మెల్యే ఆల్కాలంబాపై ఎమ్మెల్యే ఓపీ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తాను భుజాలపై ఎత్తుకెళ్లి ఢిల్లీ అసెంబ్లీ నుంచి మార్షల్స్‌ బైటికి తీసుకెళ్లారు. బీజేపీ అధిష్ఠానం తాజాగా విజేందర్‌ గుప్తాను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా నియమించడం గమనార్హం.

First Published:  20 Feb 2025 11:50 AM IST
Next Story