కేజ్రీవాల్ పై సందీప్ దీక్షిత్ పోటీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ను మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు, కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఢీకొట్టనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థలు మొదటి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ గురువారం ప్రకటించింది. 21 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. నారెల నుంచి అరుణ కుమారి, బురారి నుంచి మంగేశ్ త్యాగి, ఆదర్శ్ నగర్ నుంచి శివాంక్ సింగాల్, బదాలి నుంచి దేవేందర్ యాదవ్, సుల్తాన్ పూర్ మజ్రా (ఎస్సీ) నుంచి జై కిషన్, నాంగ్లోయ్ జాట్ నుంచి రోహిత్ చౌదరి, శాలీమార్ బాగ్ నుంచి ప్రవీన్ జైన్, వజీర్ పూర్ నుంచి రాగిణి నాయక్, సదర్ బజార్ నుంచి అనిల్ భరద్వాజ్, చాందిని చౌక్ నుంచి ముదిత్ అగర్వాల్, బలిమారన్ నుంచి హరూన్ యూసుఫ్, తిలక్ నగర్ నుంచి పీఎస్ బవ, ద్వారకా నుంచి ఆదర్శ్ శాస్త్రి, కస్తూర్బా నగర్ నుంచి అభిషేక్ దత్, ఛాత్నాపూర్ నుంచి రాజేందర్ తన్వర్, అంబేద్కర్ నగర్ (ఎస్సీ) నుంచి జయ్ ప్రకాశ్, గ్రేటర్ కైలాష్ నుంచి గర్విత్ సింఘ్వీ, ప్రతాప్ గంజ్ నుంచి అనిల్ కుమార్, సీలంపూర్ నుంచి అబ్దుల్ రహమాన్, ముస్తఫాబాద్ నుంచి అలి మహంది పోటీ చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ కు లోక్‌సభ స్థానాలను వదిలేసింది. హర్యానా ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోలేదని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు అర్వింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధమైంది.