Telugu Global
National

ఖనిజాలపై రాయల్టీ హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఖనిజాలపై పార్లమెంటుకు ఉన్న పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఖనిజాలపై రాయల్టీ హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఖనిజాలు, గనుల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు పూర్తిస్థాయి అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆయా భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకూ ఉందని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం 8 : 1 నిష్పత్తిలో న్యాయమూర్తుల అభిప్రాయాలతో ఈ తీర్పును వెల్లడించింది.

ఖనిజాలను కలిగి ఉన్న భూమిపై రాయల్టీని వసూలు చేసే రాష్ట్ర ప్రభుత్వాల హక్కును ఈ తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు సమర్థించింది. ఖనిజాలపై పార్లమెంటుకు ఉన్న పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. తాజా తీర్పుతో ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ వంటి ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది. అక్కడి ప్రభుత్వాలు ఇప్పుడు తమ భూభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్‌ కంపెనీలపై అదనపు సుంకాలు వసూలు చేసేందుకు దీని ద్వారా అవకాశం ఏర్పడుతుంది.

First Published:  25 July 2024 2:18 PM IST
Next Story