సావర్కర్ పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
ఈ కేసులో బెయిల్ మంజూరు చేసిన పూణె ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు
సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఊరట దక్కింది. పూణెలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
2023లో లండన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ సావర్కర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్నేహితులతో కలిసి ఓ ముస్లిం యువకుడిని చితకబాది ఆనందించానని సావర్కర్ తన పుస్తకంలో రాసుకున్నారని రాహుల్ ఆరోపించారు. అది పూర్తిగా అవాస్తవమని, ఊహజనిత ఆరోపణలని సావర్కర్ ముని మనవడు సాత్యకి సావర్కర్ రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. రాహుల్ ఉద్దేశపూర్వకంగా సావర్కర్ ప్రతిష్టను దిగజార్చడానికి పదే పదే యత్నిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.