దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. రేఖా గుప్తాతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Add A Comment