Telugu Global
National

విదేశాలకు రాహుల్‌ గాంధీ.. బీజేపీ నేత తీవ్ర విమర్శలు

తిప్పికొట్టిన కాంగ్రెస్‌ పార్టీ

విదేశాలకు రాహుల్‌ గాంధీ.. బీజేపీ నేత తీవ్ర విమర్శలు
X

లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ నాయకుడు అమిత్‌ మాలవీయ తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణంతో దేశమంతా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తుంటే.. రాహుల్‌ గాంధీ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం వియత్నాం వెళ్లారని 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. రాహుల్‌ తన ప్రయోజనాల కోసం మన్మోహన్‌ సింగ్‌ మరణాన్ని కూడా రాజకీయం చేశారని మండిపడ్డారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. రాహుల్‌ గాంధీ వ్యక్తిగత పర్యటనకు వెళ్తే తప్పేమిటని ప్రశ్నించింది. మన్మోహన్‌ సింగ్‌ కుటుంబం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అని.. రాహుల్‌ ఎక్కడికో వెళ్లారని ఎందుకు బాధ పడుతున్నారు.. కొత్త సంవత్సరంలోనైనా బాగు పడండి అని కాంగ్రెస్‌ ఎదురుదాడి చేసింది. సంతాప దినాల్లో రాహుల్‌ విదేశీ పర్యటనను నెటిజన్లు తప్పుబడుతుంటే సమర్థించుకోవడానికి కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ నానా తంటాలు పడుతోంది.

First Published:  30 Dec 2024 5:45 PM IST
Next Story