Telugu Global
National

భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రియాంక

తొలి అడుగులోనే విజయభేరి.. రాహుల్‌ మెజారిటీని దాటిన ప్రియాంక గాంధీ

భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రియాంక
X

కేరళలోని వయనాడ్‌లో లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు శనివారం వెల్లడవుతున్నాయి. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఈ ఫలితాల్లో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌పై ఆమె 3.94 లక్షలకు పైగా మెజారిటీతో సాధించారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్‌ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజారిటీ ని ప్రియాంక దాటేశారు

వయనాడ్‌లో 2019లో లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజారిటీ రాహుల్‌గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి పోటీ చేసిన ఆయన సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీకి మంచి ఆధిక్యం లభిస్తున్నదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు 'ఎక్స్‌' వేదికగా పోస్టు చేశారు. వయనాడ్‌ ప్రజలు అమెరికా రికార్డుస్థాయి విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘన విజయంతో మొదటిసారి ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

First Published:  23 Nov 2024 1:44 PM IST
Next Story