46వేల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ
మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల పోటీలో నిలిచిన ప్రియాంక
BY Raju Asari23 Nov 2024 10:03 AM IST
X
Raju Asari Updated On: 23 Nov 2024 10:03 AM IST
వయనాడ్‌లో లోక్‌సభ స్థానం ఫలితంపై అందరి దృష్టి ఉన్నది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇక్కడ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలువడమే కారణం. ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఆమె 46వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై ఆమె పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ, వయనాడ్‌లో రెండు చోట్ల గెలిచారు. వాయనాడ్ నుంచి ఆయన తప్పుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక ఉప ఎన్నిక బరిలో నిలిచారు.
Next Story