నేడు శీతాకాల విడిదికి రాష్ట్రపతి రాక
సాయంత్రం 5.15 గంటలకు హకీంపేట్ విమానాశ్రయానికి రానున్నద్రౌపదీ ముర్ము
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11. 20 గంటలకు విజయవాడ చేరుకోనున్న రాష్ట్రపతి మధ్యాహ్నం మంగళగిరిలో ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. విజయవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు హకీంపేట్ విమానాశ్రయానికి వస్తారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము విడిది చేస్తారు. రేపు రాష్టప్రతి భవన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో సాంస్కృతి కార్యక్రమాలకు హాజరవుతారు. ఎల్లుండి రాష్ట్రపతి నిలయంలోనే విశ్రాంతి తీసుకుంటారు. పలువురు ప్రముఖులు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉన్నది. ఈ20 సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజీని రాష్ట్రపతి సందర్శిస్తారు. డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కళాశాలకు రాష్ట్రపతి స్కాలర్స్ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. శుక్రవారం(20న) రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో 'ఎట్ హోం ' నిర్వహిస్తారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని రాష్ట్రపతి సందర్శిస్తారు. కోటి మహిళా కాలేజీ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారు.