Telugu Global
National

కాలుష్యం ఎఫెక్ట్‌.. 50 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం

కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్న పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌

కాలుష్యం ఎఫెక్ట్‌.. 50 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం
X

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ దారుణంగా క్షీణిస్తున్నది. గాలి నాణ్యతా సూచీ (AQI) 400లకు పైగా నమోదవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ప్రకటించారు.

దేశ రాజధాని పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. దీని అమలు కోసం నేటి నుంచి సెక్రటేరియట్‌ అధికారులతో భేటీలు నిర్వహించనున్నామని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఢిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్‌ మోడ్‌లో పాల్గొని తమ వాదనలు వినిపించవచ్చని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు తీసుకోవాలని గోపాల్‌ రాయ్‌ తాజాగా కేంద్రాన్ని కోరారు.

First Published:  20 Nov 2024 11:09 AM IST
Next Story