Telugu Global
National

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

హ్యాట్రిక్‌ సాధిస్తామంటున్న కమలనాథులు.. అంత ఈజీ కాదంటున్న కాంగ్రెస్‌

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
X

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. రాష్ట్రంలోని 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. మొత్తం 20,632 పోలింగ్‌ కేంద్రాల్లో రెండు కోట్లకు పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

చిన్న రాష్ట్రమే అయినా హర్యానా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నది. పదేళ్లుగా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్నది. కానీ అంతసులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న ఆపార్టీ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. 2014లో మోడీ వేవ్‌తో బీజేపీ మొదటిసారి 47 సీట్లు గెలుచుకుని హర్యానాలో అధికారంలోకి వచ్చింది. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి నేతృత్వంలో కాషాయపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో మాత్రం పూర్తి మెజారిటీ రాకపోతే (జననాయక్ జనతా పార్టీ) జేజేపీ మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే కుల సమీకరణాలు కాషాయపార్టీకి ఈసారి ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నదని విశ్లేకులు అంచనా వేస్తున్నారు. రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రాచారంలో అగ్నివీర్ పథకం, రైతుల నిరసనలు, బీజేపీకి వ్యతిరేకంగా రెజర్లర్ల ఆందోళన వంటి అంశాలను ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తామనే విశ్వాసంతో ఉన్నది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, వినేష్ ఫొగాట్‌, జేజేపీ నేతదుష్యంత్ చౌతాలాతో పాటు రేసులో ఉన్న 1,027 మంది అభ్యర్థులతో సహా కీలక రాజకీయ ప్రముఖుల భవిష్యత్తును ఓటర్లు నిర్ణయించనున్నారు.మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగాట్‌ చాక్రిద్రాద్రి పోలింగ్‌ కేంద్రంలో ఓటేసిన అనంతరం వినేష్ ఫొగాట్‌ మహిళల హక్కుల కోసం ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.

హర్యానాలో ఓటేసిన ప్రముఖులు

సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ అంబాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి క్రిషన్‌ పాల్‌ గుర్జర్‌, కర్నాల్‌లో మరో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒలింపిక్స్‌ పతక విజేత మనుబాకర్‌ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నది.


First Published:  5 Oct 2024 3:52 AM GMT
Next Story