మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నేడు నైజీరియా బయలుదేరనున్నారు. అధ్యక్షుడు బోలా టిను అహ్మద్ ఆహ్వానం మేరకు మోడీ నేడు, రేపు పర్యటిస్తారు. గత 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. తర్వాత రెండు రోజులు బ్రిటన్‌లో పర్యటించనున్న ప్రధాని.. రియో డి జనీరోలో జరిగే జీ-20 సదస్సులో పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. వివిధ సమస్యలపై జీ-20 సదస్సులో భారత దేశ వైఖరని ప్రధాని వివరిస్తారు. జీ20 సదస్సు సందర్భంగా పలువురు నేతలలో ప్రధాని భేటీ కానున్నట్లు సమాచారం. నవంబర్ 19-21 వరకు ప్రధాని గయానాలో పర్యటిస్తారు.
Previous Articleయూపీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల సజీవదహనం
Next Article అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు!
Keep Reading
Add A Comment