Telugu Global
National

ప్రాణాలను పణంగా పెట్టి ప్రచారం చేస్తున్న

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్‌ ఓవైసీ

ప్రాణాలను పణంగా పెట్టి ప్రచారం చేస్తున్న
X

కిడ్నీలు పని చేయడం లేదు.. శరీరంలో బుల్లెట్‌ అలాగే ఉంది.. అయినా ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నానని ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి.. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఎంఐఎం పలు స్థానాల్లో పోటీకి దిగింది. ఆ పార్టీ చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు అక్బరుద్దీన్‌ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచార బాధ్యతలు ఎత్తుకున్నారు. అక్బరుద్దీన్‌ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, తనకు కిడ్నీలతో పాటు ఒక చేయి పని చేయడం లేదని.. ఎక్కువ మాట్లాడొద్దని, ప్రయాణాలు చేయొద్దని డాక్టర్లు చెప్పారని తెలిపారు. తాను ఎక్కువగా ప్రయాణాలు చేస్తే పేగులు చీలిపోతాయని కూడా హెచ్చరించారన్నారు. మహారాష్ట్ర పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని.. సభలో ఏం మాట్లాడాలో కూడా పోలీసులే చెప్తున్నారని, తనకు నోటీసులు కూడా ఇచ్చారని తెలిపారు. నుదుటిపై బొట్టు పెట్టుకున్న వాళ్లకు ఎలాంటి హక్కులుంటాయో తలపై టోపీ పెట్టుకున్న వాళ్లకు కూడా అవే హక్కులు ఉంటాయన్నారు.

First Published:  10 Nov 2024 12:29 PM IST
Next Story