Telugu Global
National

పార్లమెంటు శీతాకాల సమావేశాల దృష్ట్యా అఖిపక్ష సమావేశం

అదానీ, మణిపూర్‌, ఫక్ఫ్‌ సవరణ బిల్లు అంశాలపై చర్చలకు సమయం కేటాయించాలని కోరనున్న విపక్షాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాల దృష్ట్యా అఖిపక్ష సమావేశం
X

రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాల అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ మొదలైంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, కాంగ్రెస్‌, తృణమూల్‌, డీఎంకే, బీజేడీ తదితర పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఫలితాల వేళ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలను కోరనున్నది. రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, బిల్లులపై వివిధ పార్టీలకు కేంద్ర సమాచారం ఇవ్వనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదానీ, మణిపూర్‌, ఫక్ఫ్‌ సవరణ బిల్లు అంశాలపై చర్చలకు సమయం కేటాయించాలని విపక్షాలు కేంద్రాన్ని కోరనున్నాయి.

First Published:  24 Nov 2024 11:27 AM IST
Next Story