ఇండిగో విమానాలకు ఆగని బాంబు బెదిరింపులు
ఈ వారంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు మొత్తం 100కుపైగా హెచ్చరికలు వచ్చాయన్న ఆ సంస్థ ఉన్నతాధికారులు
BY Raju Asari22 Oct 2024 1:56 PM IST
X
Raju Asari Updated On: 22 Oct 2024 1:56 PM IST
భారత్‌కు చెందిన విమానాలకు వరుస బాంబు బెదిరింపులు ప్రజల్లో ఆందోళన కలిస్తున్నాయి. విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఇవి ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే మంగళవారం మరో 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని ఇవి వచ్చాయని పేర్కొన్నారు. ఈ వారంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు మొత్తం 100కుపైగా హెచ్చరికలు వచ్చాయని తెలిపారు. జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడంతో మా సిబ్బంది వెంటనే అప్రమత్తయ్యారు. ప్రయాణికులను తరలించి.. తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇండిగో ఉన్నతాధికారులు తెలిపారు.
Next Story