Telugu Global
National

కేరళ, తమిళనాడు తీరాలకు 'కల్లక్కడల్‌' ముప్పు

కల్లక్కడల్‌ అనేది సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పు

కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్‌ ముప్పు
X

కేరళ, తమిళనాడు తీరాలకు 'కల్లక్కడల్‌' ముప్పు పొంచి ఉన్నదని కేంద్ర ప్రభుత్ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. జనవరి 15న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉన్నదని సమాచారం. ఈ రోజు రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీ నుంచి 1 మీటర్ల మేర అలల తాకిడి ఉంటుందని, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నదని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓసియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఐఎన్‌సీవోఐఎస్‌) హెచ్చరించింది.

ఐఎన్‌సీవోఐఎస్‌ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వమణ సంస్థ 'కేఎస్‌డీఎంఏ' అప్రమత్తమైంది. అధికారుల సూచన మేరకు తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది. తీర ప్రాంత వాసులు ఎట్టి పరిస్థితుల్లో చిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ముందుగానే పడలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. ప్రస్తుతం జారీచేసిన ప్రకటనను విరమించుకునేదాకా పర్యాటకులు బీచ్‌లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు కేఎస్‌డీఎంఏ సూచించింది.

కల్లక్కడల్‌ అంటే?

కల్లక్కడల్‌ అనేది సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పు. అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలలే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని ఐఎన్‌సీవోఐఎస్‌ సంస్థ వెల్లడించింది. ఎలాంటి సూచన, హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయని పేర్కొన్నది. అందుకే దీన్ని స్థానికంగా కల్లక్కడల్‌ అని పిలుస్తారు.

First Published:  15 Jan 2025 7:16 AM IST
Next Story