దేశ ముఖచిత్రానే మార్చేసిన మన్మోహన్
మన్మోహన్ ఎన్నో కీలక పదవులు అధిష్ఠించినా సామాన్య జీవితం గడిపారన్న మోడీ
BY Raju Asari27 Dec 2024 12:07 PM IST
X
Raju Asari Updated On: 27 Dec 2024 12:07 PM IST
ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్‌ను దేశం ఎల్లప్పుడు గుర్తుంచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆర్‌బీఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో మన్మోహన్ సేవలందించారని గుర్తుచేశారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ముఖచిత్రాన్ని మార్చేశారని కొనియాడారు. దేశం, ప్రజల పట్ల ఆయన సేవా భావం స్మరించుకోదగిందని చెప్పారు. విలక్షణ పార్లమెంటేరియన్‌గా ఆయన సేవలందించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎన్నో కీలక పదవులు అధిష్ఠించినా సామాన్య జీవితం గడిపారన్నారు.జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చాలాసార్లు మాట్లాడాను. తన తరఫున దేశం తరఫున నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.
Next Story