పార్లమెంటులో నేడు 'రాజ్యాంగ' ప్రత్యేక కార్యక్రమం
రాజ్యాంగం ఆమోదం పొంది 75 పూర్తయిన సందర్బంగా వేడుకలు
రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 75 ఏళ్లు పూర్తికావడంతో ఇవాళ పాత పార్లమెంటు భవనం ప్రాంగణంలోని సెంట్రల్ హాల్‌లో వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వంలో జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా పాల్గొననున్నారు. రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించరని స్పష్టం చేశారు. అటు రాజ్యాంగపై కేంద్రం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. వెబ్‌సైట్‌లో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొన్నది. నేటి నుంచి ఏడాది పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నగరాలు, గ్రామాలు, పాఠశాలలలో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ధృవపత్రాలు పొందవచ్చని వివరించింది.