Telugu Global
National

మోదీ ఆర్థిక నిర్ణయాలే దేశ ఆర్థిక వ్యవస్థకు శాపం

మోడీ ప్రభుత్వ విధానాలను ఎక్స్‌ వేదికగా ఎండగట్టిన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

మోదీ ఆర్థిక నిర్ణయాలే దేశ ఆర్థిక వ్యవస్థకు శాపం
X

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే చేస్తున్నారని.. మళ్లీ మళ్లీ వాటినే పునరావృతం చేసినా దేశ ఆర్థిక వ్యవస్థలో బీజేపీ సర్కార్‌ వైఫల్యాలను కప్పిపుచ్చలేరన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.

మోదీ ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారాయన్నారు. మోదీజీ.. మీరు పాత ప్రసంగాలనే పునరావృతం చేయడం వ్ల దేశ ఆర్థిక వ్యవస్థలో బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చలేరు. 2013-14 నుంచి ఇప్పటివరకు గృహ సంబంధిత ఖర్చులు 241 శాతం పెరిగాయి. జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేనివిధంగా పెరిగింది. కొవిడ్‌ సమయం నుంచి ప్రజలకు ఆదాయకంటే ఖర్చు రెట్టింపు అయ్యింది అని రాసుకొచ్చారు.

గత ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగాయి. ధరల పెరుగుదల బీజేపీ తీసుకున్న నిర్ణయం. అసంఘటిత రంగాన్ని నాశనం చేయడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. యూపీఏ హయాంలో పెరిగిన భారత్‌ ఎగుమతుల లాభాలను మీ విధానాలతో విస్మరించడంతోనే పదేళ్లలో మేకిన్‌ ఇండియా ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

First Published:  6 Oct 2024 7:00 PM IST
Next Story