కువైట్ పర్యటనకు బయలుదేరిన మోడీ
భారత ప్రధాని కువైట్‌కు వెళ్లడం 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి
BY Raju Asari21 Dec 2024 12:11 PM IST
X
Raju Asari Updated On: 21 Dec 2024 12:11 PM IST
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కువైట్ పర్యటనకు బయలుదేరారు. ఆ దేశంలో రెండురోజులపాటు మోదీ పర్యటన కొనసాగనున్నది. ఆ దేశ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ బుజేర్ అల్ సహబ్ ఆహ్వానం మేరకు మోడీ కువైట్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాని కువైట్‌కు వెళ్లడం 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఈ సందర్బంగా మోడీ ఆ దేశంలోని అగ్ర నాయకులతో పాటు అక్కడున్న భారతీయులను కలుసుకోనున్నారు. భారత కార్మిక శిబిరాన్ని కూడా సందర్శిస్తారు. ఈ పర్యటనలో అరేబియా గల్ఫ్ కప్, ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నది. మోడీ, కువైట్ రాజు మధ్య రక్షణ, వాణిజ్యంతో సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కువైట్‌లో జరిగే 'హలా మోడీ' కార్యక్రమంలో సుమారు 4 వేల మంది భారతీయులను మోడీ కలుసుకుంటారని అధికారులు తెలిపారు.
Next Story