Telugu Global
National

అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా

సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు

అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా
X

అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా సబబేనని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్సిటీకి మైనార్టీ హోదా ఉంటుందని స్పష్టం చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు మైనార్టీ హోదా ఉంటుందని చెప్పగా, ముగ్గురు వ్యతిరేకించారు. దీంతో 4:3 నిష్పత్తిలో తీర్పు వెలువరించారు. 1875లో అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ స్థాపించారు. వర్సిటీ మైనార్టీ హోదా 1967లో ఆ హోదా రద్దు చేశారు. అలీఘర్‌ ముస్లిం వర్సిటీకి మైనార్టీ హోదా కల్పించాలని కోరుతూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన విచారణ ముగించి తీర్పు రిజర్వ్‌ చేసింది. శుక్రవారం తుది తీర్పు వెలువరించింది.

First Published:  8 Nov 2024 1:52 PM IST
Next Story