ట్యూషన్ టీచర్ -మైనర్ బాలుడి ప్రేమ.. ఆన్‌లైన్ ఆర్డర్‌తో అరెస్ట్
తట్టుకోలేని బాలుడు టీచర్‌ను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. టీచర్ ఇంటి అడ్రస్‌కు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టడం స్టార్ట్ చేశాడు.
సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదారి పడుతోంది. చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాల్సిన విద్యార్థులు ప్రేమ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు. పెద్దాచిన్నా తేడా లేకుండా వ్యవహరిస్తూ తలదించుకునే పనులకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడిన మైనర్.. ఆమె దూరం పెట్టేసరికి వేధింపులకు దిగాడు. ఈ ఘటన చెన్నైలోని పెరియామెట్లో జరిగింది.
మ్యాటర్‌లోకి వెళ్తే.. 22ఏళ్ల ఓ టీచర్, 17ఏళ్ల బాలుడికి ట్యూషన్ చెప్పేది. ఈక్రమంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు గడిచాక ఉన్నట్టుండి టీచర్ బాలుడిని దూరం పెట్టింది. ఇది తట్టుకోలేని బాలుడు టీచర్‌ను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. టీచర్ ఇంటి అడ్రస్‌కు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఏకంగా 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్స్ బుక్ చేసి నిత్యం వేధించాడు. దీంతో ఆ టీచర్ కుటుంబం ఈ పని ఎవరు చేస్తున్నారో తెలియక మానసిక వేదనకు గురైంది. చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన ఐపీ నంబర్ ఆధారంగా వారు దర్యాప్తు చేపట్టారు. ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లు, ఓ వైఫై రూటర్‌ను సీజ్ చేశారు.