Telugu Global
National

Tata Curvv | ఆ మూడు కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న టాటా క‌ర్వ్‌.. సెప్టెంబ‌ర్ 2న ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ డిటెయిల్స్‌.. !

న్యూ అడాప్టివ్ టెక్ ఫార్వ‌ర్డ్ లైఫ్ స్టైల్ (అట్లాస్‌) ఆర్కిటెక్చ‌ర్ ఆధారంగా నిర్మించిన ఐసీఈ మోడ‌ల్ కారు టాటా క‌ర్వ్ నాలుగు వేరియంట్లు - ఎకంప్లిష్డ్‌, క్రియేటివ్‌, ప్యూర్‌, స్మార్ట్ వేరియంట్ల‌లో ల‌భిస్తుంది.

Tata Curvv | ఆ మూడు కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న టాటా క‌ర్వ్‌.. సెప్టెంబ‌ర్ 2న ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ డిటెయిల్స్‌.. !
X

Tata Curvv | దేశీయ కార్ల మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్ల‌దే హ‌వా.. ప్ర‌తి ఒక్క‌రూ ఎస్‌యూవీ కారు పైనే మోజు పెంచుకుంటున్నారు. మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) మోడ‌ల్ కార్ల‌దే హ‌వా. అత్యంత పోటీత‌త్వం గ‌ల మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్‌లోకి కొత్త పోటీదారు టాటా క‌ర్వ్ (Tata Curvv)) వ‌స్తోంది. ఎస్‌యూవీ కూపే కారు టాటా క‌ర్వ్.ఈవీ ఇప్ప‌టికే దేశీయ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. పెట్రోల్ లేదా డీజిల్‌తో న‌డిచే సంప్ర‌దాయ ఇంట‌ర్న‌ల్ కంబుస్ట‌న్ ఇంజిన్ (ఐసీఈ) వ‌ర్ష‌న్ సెప్టెంబ‌ర్ రెండో తేదీన భార‌త్ మార్కెట్‌లోకి వ‌స్తోంది.

న్యూ అడాప్టివ్ టెక్ ఫార్వ‌ర్డ్ లైఫ్ స్టైల్ (అట్లాస్‌) ఆర్కిటెక్చ‌ర్ ఆధారంగా నిర్మించిన ఐసీఈ మోడ‌ల్ కారు టాటా క‌ర్వ్ నాలుగు వేరియంట్లు - ఎకంప్లిష్డ్‌, క్రియేటివ్‌, ప్యూర్‌, స్మార్ట్ వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోనే స‌మృద్ధ‌ ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న తొలి కారు టాటా క‌ర్వ్ (Tata Curvv). ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు బై-ఫంక్ష‌న్ ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్న‌రింగ్ ఫంక్ష‌న్‌తో టాటా క‌ర్వ్ ఉంటుంది. రేర్‌లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌, సీక్వెన్షియ‌ల్ ట‌ర్న్ ఇండికేట‌ర్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌, గెస్చ‌ర్ కంట్రోల్డ్ ప‌వ‌ర్డ్ టెయిల్ గేట్ ఉంటాయి.

క్యాబిన్ ఇన్‌సైడ్‌లో వెంటిలేటెడ్ సీట్లు, సిక్స్ వే ప‌వ‌ర్డ్ డ్రైవ‌ర్ సీట్‌, ఫుల్లీ ఆటోమేటిక్ టెంప‌రేచ‌ర్ కంట్రోల్‌, ఇల్యూమినేటెడ్ లోగోతో ఫోర్ స్పోక్ డిజిట‌ల్ స్టీరింగ్ వీల్‌, హార్మ‌న్ 12.3-అంగుళాల ట‌చ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 10.25 అంగుళాల డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, నేవీగేష‌న్ డిస్‌ప్లే ఆన్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, ట‌చ్ బేస్డ్ హెచ్‌వాక్ కంట్రోల్స్‌, ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ విత్ ఏక్యూఐ డిస్‌ప్లే, 9-స్పీక‌ర్ జేబీఎల్ సౌండ్ సిస్ట‌మ్ ఫీచ‌ర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్‌, టాటా హారియ‌ర్‌, టాటా స‌ఫారీతోపాటు టాటా కర్వ్ కారు కూడా ప్రామాణికంగా సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ క‌లిగి ఉంటుంది. ఎల‌క్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌, హిల్ హోల్డ్ కంట్రోల్‌, హిల్ డిస్కెంట్ కంట్రోల్‌, 360-డిగ్రీ కెమెరా, 360- డిగ్రీ స‌రౌండ్ వ్యూ సిస్ట‌మ్ విత్ బ్లైండ్ వ్యూ మానిట‌ర్ (ఆన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ అండ్ క్ల‌స్ట‌ర్‌), ఫ్రంట్ పార్కింగ్ సెన్స‌ర్లు, 20 ఫంక్ష‌నాలిటీస్‌తో వ‌స్తోంది.

టాటా క‌ర్వ్ మూడు ఇంజిన్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. 1.2-లీట‌ర్ల రివోట్రాన్ పెట్రోల్ (120 పీఎస్ విద్యుత్‌, 170ఎన్ఎం టార్క్‌), 1.2-లీట‌ర్ల హైప‌రియాన్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్ష‌న్ (125 పీఎస్ విద్యుత్‌, 225 ఎన్ఎం టార్క్‌), 1.5- లీట‌ర్ల క్య్రోజెట్ డీజిల్ (118 పీఎస్ విద్యుత్‌, 260 ఎన్ఎం టార్క్‌) ఇంజిన్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తోంది. మూడు ఇంజిన్ ఆప్ష‌న్లలోనూ 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తోంది. టాటా క‌ర్వ్ ధ‌ర రూ.11 ల‌క్ష‌ల నుంచి రూ.19 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంద‌ని భావిస్తున్నారు.

First Published:  11 Aug 2024 3:07 PM IST
Next Story