Telugu Global
National

మన్మోహన్‌సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభం

ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు కొనసాగనున్నయాత్ర

మన్మోహన్‌సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభం
X

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు ఈ యాత్ర కొనసాగనున్నది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మన్మోహన్‌ పార్థివదేహాన్ని శనివారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చాకు. పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించడం కోసం అక్కడ ఉంచారు. పార్థివదేహం వద్ద సింగ్‌ సతీమణి గురుశరణ్‌ సింగ్‌, ఆయన కుమార్తె, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌ తదితర నేతలు అంజలి ఘటించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి నివాళులు అర్పించారు.

జో బైడెన్‌ సంతాపం

మన్మోహన్‌ సింగ్‌ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం తెలిపారు. మ ఆజీ ప్రధాని సతీమణి గురు శరన్‌ సింగ్‌, కుటుంబసభ్యులకు బైడెన్‌ దంపతులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు వైట్‌ హౌస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

First Published:  28 Dec 2024 10:51 AM IST
Next Story