Telugu Global
National

అసోంలో రైలు ప్రమాదం

పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌

అసోంలో రైలు ప్రమాదం
X

అసోంలో రైలు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం లోకమాన్య తిలక్ ఎక్స్‌ ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. అగర్తలా నుంచి ముంబయికి వెళ్తోన్న ఈ రైలు దిమా హసావో జిల్లాలోని దిబలోంగ్‌ స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం కలుగలేదని వివరించారు. ఇంజిన్‌, పవర్‌ కార్‌ తో పాటు ఎనిమిది కోచ్‌ లు పట్టాలు తప్పాయని వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో లుమ్‌డింగ్‌ - బాదర్‌పూర్‌ మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. రైలు ప్రమాద వివరాలు, ప్రయాణికుల క్షేమ సమాచారం కోసం హెల్ప్‌ లైన్‌ నంబర్లు 03674 263120, 03674 263126 సంప్రదించాలని అధికారులు సూచించారు.

First Published:  17 Oct 2024 6:24 PM IST
Next Story