Telugu Global
National

సొంతకాళ్లపై నిల్చోవడం నేర్చుకోండి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

సొంతకాళ్లపై నిల్చోవడం నేర్చుకోండి
X

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్‌సీపీ వ్యవస్థాపకుడైన శరద్‌ పవార్‌ ఫొటోలు, వీడియోలు ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని ఆదేశించింది. అలాగే సొంతకాళ్లపై నిల్చోవడం నేర్చుకోవాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం చురకలు అంటించింది.

అంతకుముందు విచారణలో శరద్ పవార్ తరపున హాజరైన అభిషేక్ సింఘ్వి, అజిత్ పవార్ శిబిరం తన క్లయింట్ ప్రజాదరణను వాడుకోవాలని స్వార్థంతో వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా ఇద్దరు ప్రత్యక్ష ప్రత్యర్థులుగా ఉన్న 36 సీట్ల కోసం ఈ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గత ఏడాదిలో ఎన్సీపీలో చీలక వచ్చింది. అజిత్‌ పవార్‌ పార్టీలో చీలిక తీసుకొచ్చి మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శిండే ప్రభుత్వానికి మద్దతు తెలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయ్యారు. దాంతో పార్టీ రెండుగా చీలిపోగా.. అజిత్‌ పవార్‌ వర్గానే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. అసెంబ్లీలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ వర్గమే చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీనియర్‌ పవార్‌ ఫొటోలు, వీడియోలు వాడుతున్నారని ఆరోపిస్తూ ఆయన మద్దతుదారులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సుప్రీం ధర్మానసం తాజా ఆదేశాలు జారీ చేసింది.

First Published:  13 Nov 2024 3:12 PM IST
Next Story