Telugu Global
National

ఏఐ సాయంతో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి: రాష్ట్రపతి

నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఏఐ సాయంతో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి: రాష్ట్రపతి
X

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేధ (ఏఐ)ను మరింత వినియోగించుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నల్సార్‌ లా యూనివర్సిటీ నిర్వహించిన 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ధనికులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేకపోతున్నారని.. మెరుగైన సమాజాం కోసం ఈ విధానంలో మార్పు రావాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచారని ముర్ము అన్నారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తునకు ఎదగొచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎంలో ఉత్తమ ప్రతిభ చాటినవారికి విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారం పతకాలు అందించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పి.ఎస్‌ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, వైస్‌ ఛాన్స్‌లర్‌ శ్రీకృష్ణదేవ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్‌ ఆలోక్‌ అరాధే రాష్ట్రపతికి జ్ఞాపికను బహుకరించారు.

అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌ స్వాగతం పలికారు.

First Published:  28 Sept 2024 11:52 AM GMT
Next Story