Telugu Global
National

51 సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

జస్టిస్‌ ఖన్నా చేత ప్రమాణం చేయించిన రాష్ట్రపతి. కార్యక్రమంలో పాల్గొన్నఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు

51 సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం
X

ఎన్నికల బాండ్లు, ఆర్టికల్‌ 370 తదిర కేసుల్లో కీలక తీర్పులు వెలువరించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 51 సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సీజేఐగా జస్టిస్‌ ఖన్నా చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. సీజేఐ ప్రమాణ స్వీకారానికి ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీ, మాజీ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్, కిరణ్‌ రిజిజు, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, హర్దీప్ సింగ్‌ పురి, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా తదితరులు పాల్గొన్నారు. జస్టిస్‌ ఖన్నా 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగున్నారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్థానంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు.

1960 మే 14న న్యాయమూర్తుల కుటుంబంలో జన్మించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఢిల్లీ వర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ న్యాయవాదిగా నమోదు చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. టాక్సేషన్‌, ఆర్బిటేషన్‌, కమర్షియల్‌, కంపెనీ లా కేసులు వాదించారు. 2005 జూన్‌ 25న ఢిల్లీ హైకోర్టు అడిషన్‌ న్యాయమూర్తిగా, 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 నుంచి జనవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఖన్నా ఆరేళ్ల కాలంలో 117తీర్పులు రాశారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలక తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ తీరర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు.

First Published:  11 Nov 2024 10:30 AM IST
Next Story