ఝార్ఖండ్‌లో జేఎంఎం జోరు
మ్యాజిక్ ఫిగర్ దాటి 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఇండియా కూటమి
ఝార్ఖండ్‌లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు భిన్నంగా జేఎంఎం కూటమి జోరు ప్రదర్శించింది. జేఎంఎం 33, కాంగ్రెస్ 17, ఆర్జేడీ 5, సీపీఐ ఎంఎల్ 2 రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ దాటి 54 స్థానాల్లో అధిక్యంలో ఉన్నది. జేఎంఎం కూటమి గెలుపు ఖాతా తెరిచింది. ఎనిమిది చోట్ల విజయం సాధించింది. మరో 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. బీజేపీ 23 చోట్ల లీడ్‌లో ఉండగా.. మూడు చోట్ల గెలుపొందింది. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 41. సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ గండే సీటుపై 9,000 ఓట్లతో దుమ్కాలో హేమంత్ సోరెన్ బసంత్ సోరెన్ వెనుకంజలో ఉన్నారు. జంతారాలో సీతా సోరెన్ (బీజేపీ) ఆధిక్యంలో ఉన్నారు. ధన్వార్‌లో ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి, సారాయ్‌కెలా ఆ రాష్ట్ర మాజీ సీఎం చంపాయీ సోరెన్ ముందంజలో ఉన్నారు.