జేఈఈ (మెయిన్) సెషన్-2 పరీక్ష దరఖాస్తులు షురూ
ఫిబ్రవరి 1 నుంచి 25 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుందని ఎన్టీఏ వెల్లడి
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు/ఐఐఐటీలు/ ఇతర ప్రఖ్యాత విద్యాసంస్థల్లో బీటెక్/బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ (మెయిన్) సెషన్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసిన విషయం విదితమే. దీంతో రెండో సెషన్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 25 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుందని ఎన్టీఏ వెల్లడించింది. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 25న రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుం: ఫిబ్రవరి 25 రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, అడ్మిట్ కార్డులను తగిన సమయంలో విడుదల చేస్తారు.
పరీక్ష ఎప్పుడు? జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 1-8 మధ్య వివిధ తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలను ఏప్రిల్ 17 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నది.
హెల్ప్ లైన్ ఇదే: దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 011-40759000/011-69227700 నంబర్లకు కాల్ చేయవచ్చు లేదా jeemain.nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.